Coronavirus: కరోనా కేసులు పెరుగుతోన్న వేళ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌.. ఆగస్టు 15 రోజున..

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు శాంతించిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పైపైకి వెళుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ప్రతి రోజూ 15 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దేశ...

Coronavirus: కరోనా కేసులు పెరుగుతోన్న వేళ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌.. ఆగస్టు 15 రోజున..
Follow us

|

Updated on: Aug 12, 2022 | 4:42 PM

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు శాంతించిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పైపైకి వెళుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ప్రతి రోజూ 15 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 16,561 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక 49 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు ప్రారంభించింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రజలు మాస్కుల, ధరించి, తప్పకుండా భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు 5.44 శాతంగా నమోదుకావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్క రోజే 2,726 కేసులు నమోదయ్యాయి. ఏడు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక దేశంలో ఇప్పటి వరకు 207.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..