బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

ఇంట్లో బాత్రూమ్‌ శుభ్రం చేస్తూ.. బట్టలు ఉతుకుతూ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీసుకున్న ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో భారత్ మొత్తం లాక్‌‌డౌన్ కావడంతో..

  • Publish Date - 4:07 pm, Wed, 25 March 20 Edited By:
బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

ఇంట్లో బాత్రూమ్‌ శుభ్రం చేస్తూ.. బట్టలు ఉతుకుతూ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీసుకున్న ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో భారత్ మొత్తం లాక్‌‌డౌన్ కావడంతో.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో క్రికెటర్లు కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య ఆయేషాతో కలిసి శిఖర్ ఓ ఫన్నీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో.. ‘శిఖర్ భార్య ఆయేషా.. అతన్ని కర్ర పట్టుకుని మందలిస్తుండగా.. ఆయన ఆమెకు భయపడుతూ.. ఇంట్లో పని చేస్తున్నారు. ఆ సమయంలో కూడా ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు ఆయేషా కనపడుతుంది. అన్ని పనులు భర్తకు చెబుతూ ఆమె మేకప్ వేసుకుంటోంది’. ‘దీన్ని ట్విట్టర్ ద్వారా శిఖర్ ధావన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. వన్ వీక్ తర్వాత లైఫ్.. రియాల్టి హార్డ్ అని ఫన్నీ కాప్షన్ పెడుతూ’ ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే