కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మాస్క్ లేకుండా రోడ్డెక్కితే భారీ జరిమానా విధించనుంది. అంతేకాకుండా రోడ్డుపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. సీసీటీవీ థర్డ్ ఐ, ఏఐ బేస్డ్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు.
త్వరలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ఎన్నిసార్లు మాస్కులు లేకుండా తిరిగితే అన్ని సార్లు రూ. 1000 జరిమానా చెల్లించాల్సిందేనని పోలీసులు అంటున్నారు. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.
Read More:
మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!
కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..
‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!
వారి కోసమే లాక్డౌన్ను ఎత్తేస్తున్నాంః ఇమ్రాన్ ఖాన్
‘సాహో’ చైనా.. కిమ్ ఆత్మీయ సందేశం.!