హైద‌రాబాద్ః వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్‌

లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా నేటి నుంచి దేశ‌వ్యాప్తంగా ప‌లు ఆల‌యాలు తెరుచుకున్నాయి. గ‌త 80 రోజులు భ‌గ‌వంతునికి దూరంగా ఉన్న భ‌క్తులు ఆల‌యాల‌కు క్యూ క‌ట్టారు. ఈ క్ర‌మంలో గవర్నర్‌ తమిళిసై కుటుంబ సమేతంగా

హైద‌రాబాద్ః వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్‌
Follow us

|

Updated on: Jun 08, 2020 | 5:12 PM

లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా నేటి నుంచి దేశ‌వ్యాప్తంగా ప‌లు ఆల‌యాలు తెరుచుకున్నాయి. గ‌త 80 రోజులు భ‌గ‌వంతునికి దూరంగా ఉన్న భ‌క్తులు ఆల‌యాల‌కు క్యూ క‌ట్టారు. హైద‌రాబాద్‌లోనూ ప్ర‌ముఖ ఆల‌యాల‌కు భ‌క్తులు బారులుతీరారు. ఈ క్ర‌మంలో గవర్నర్‌ తమిళిసై కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లాకడౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

రాష్ట్రం తరపున ప్రజల యోగ‌క్షేమాల‌పై స్వామివారిని ప్రార్ధించిట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ఇప్పట్లో వదలదన్న ఆమె , ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరూ మాస్కులు వాడాలని.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.  ద‌ర్శ‌నానంత‌రం అనంత‌రం అక్క‌డ్నుంచి గవర్నర్‌ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వెళ్లారు. నిమ్స్‌లోని మిలీనియం బ్లాక్ ను పరిశీలించారు. పరిశీలన అనంతరం నిమ్స్ ఆస్ప‌త్రి అథారితిటితో గవర్నర్‌ సమావేశం అయ్యారు. డాక్టర్లకు అందుతున్న వైద్యంపై తమిళి సై ఆరా తీసారు.ఫ్రంట్‌ లైన్‌లో ఉన్న మెడికోలకు పాజిటివ్‌ రావటం బాధాకరమని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ఒక డాక్టర్‌గా వాళ్ళను పరామర్శించానన్నారు.