కరోనా అప్‌డేట్స్‌.. తెలంగాణలో 51 పాజిటివ్ కేసులు..!

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 51 కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌.. తెలంగాణలో 51 పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 10:04 PM

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 51 కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. వీరిలో 822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2051కు చేరింది. ఇవాళ 54 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1056కి చేరింది. అలాగే మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరింది.

Read This Story Also:  మరింత విషమించిన అజిత్ జోగి ఆరోగ్యం..!