వరల్డ్ బీబీసీ న్యూస్‌లో బాలుపై ప్రత్యేక బులిటెన్..

సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. కరోనా మహమ్మారి కాటుకు మన గానగంధర్వుడు కాలం చేశాడు. ఆయన కడసారి చూపుకోసం సినీ లోకం అంతా తరలిరాలేకపోయింది. అయినా..

వరల్డ్ బీబీసీ న్యూస్‌లో బాలుపై ప్రత్యేక బులిటెన్..
Follow us

|

Updated on: Sep 27, 2020 | 11:11 AM

సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. కరోనా మహమ్మారి కాటుకు మన గానగంధర్వుడు కాలం చేశాడు. ఆయన కడసారి చూపుకోసం సినీ లోకం అంతా తరలిరాలేకపోయింది. అయినా ఆయనను కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు ఎందరో ప్రముఖులు అక్కడకు విచ్చేసి బాలుకు నివాళి అర్పించారు. బాలుకున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. బాలు మరణవార్తను వరల్డ్ బీబీసీ న్యూస్ లో ప్రత్యేక బులిటెన్ ప్రసారం చేశారు. అందులో మన బాలుగురించి ఏమన్నారంటే..

సాధారణంగా అంతర్జాతీయ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇచ్చే వరల్డ్ బీబీసీ న్యూస్ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక న్యూస్ బులెటిన్ ప్రసారం చేసింది. సీనియర్ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని, ఆయను అందరూ ఎస్పీబీ అని పిలుచుకుంటారని బీబీసీ యాంకర్ వార్తలు చదివారు. 74 ఏళ్ల వయసున్న బాలు దక్షిణ భారత సినీ రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులు అందుకున్నారని, ఆగస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు. తన 50 ఏళ్ల కెరీర్ లో డజనుకు పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం బాలు మృతికి సంతాపం తెలిపారని వెల్లడించారు. అంతేకాదు, బాలు మృతిపై లైవ్ లో అభిప్రాయాలు కూడా అడిగారు. కాగా, ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. దీనికి నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. బాలు నిలువెత్తు ఖ్యాతికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్లు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..