Sonu Sood: కరోనా పేషెంట్ భారతి మృతి… హృదయం ముక్కలైందంటూ సోనూసూద్ ఎమోష‌న‌ల్

దేశం ఇప్పుడు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉంది. మ‌న కంట్రీకి రైట్ నౌ రీల్ హీరోలు కాదు.. రియ‌ల్ హీరోలు కావాలి. అలా ముందుకు వ‌చ్చిన‌వారిలో అక్ష‌య్ కుమార్, సోనూ సూద్ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.

Sonu Sood: కరోనా పేషెంట్ భారతి మృతి… హృదయం ముక్కలైందంటూ సోనూసూద్ ఎమోష‌న‌ల్
Sonu Sood

దేశం ఇప్పుడు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉంది. మ‌న కంట్రీకి రైట్ నౌ రీల్ హీరోలు కాదు.. రియ‌ల్ హీరోలు కావాలి. అలా ముందుకు వ‌చ్చిన‌వారిలో అక్ష‌య్ కుమార్, సోనూ సూద్ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. ముఖ్యంగా సోనూ సూద్ అయితే.. సాయం అంటే చాలు ఏదో ఒక ర‌కంగా వారికి అండ‌గా నిలుచుంటున్నాడు. కరోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి త‌న మంచి మ‌న‌సు కార‌ణంగా దేశ ప్ర‌జ‌ల‌కు హీరో అయ్యాడు. అయితే ఈ న‌టుడు తాజాగా భావోద్వేగానికి లోనయ్యారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి అత‌డు ఎంత‌గానో ప్ర‌య‌త్నించినప్ప‌టికీ.. విధి మాత్రం ఆమెను లాగేసుకుపోయింది. దీంతో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు సోనూ. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు.

“క‌రోనా బాధ‌ప‌డుతున్న‌ భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూసింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో ఆమె బ్రతుకు కోసం పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. నేను ఆమెను బతికించేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్ప‌లేం. నా హృదయం ముక్కలైంది” అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారతి అనే యువతికి ఇటీవ‌ల క‌రోనా సోకింది. వైరస్‌ కారణంగా ఆమె లంగ్స్ 85 శాతం వరకూ డ్యామేజ్ అయ్యాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ స‌మాచారం తెలుసుకున్న సోనూ.. భారతి కోసం ఓ స్పెష‌ల్ ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.

Also Read:  టీకా తీసుకున్నవారిలో ఎంతమందికి కోవిడ్‌ వచ్చిందంటే…!

సినీకార్మికులకు అండగా సల్మాన్ ఖాన్. ఏకంగా 25 వేల మంది కార్మికులకు..