SECONDWAVE ENDS: దేశంలో సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం.. అనుకున్నదానికంటే ముందే సక్సెస్సంటున్న నిపుణులు

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతూ వుండడం ఒకెత్తైతే.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వుండడం మంచి పరిణామంగా భావించాలి.

SECONDWAVE ENDS: దేశంలో సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం.. అనుకున్నదానికంటే ముందే సక్సెస్సంటున్న నిపుణులు
India Map With Corona Virus + Modi + Vaccine
Follow us

|

Updated on: Jun 07, 2021 | 7:35 PM

SECONDWAVE ENDS EXPERTS LOOKING GOOD INDICATION: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతూ వుండడం ఒకెత్తైతే.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వుండడం మంచి పరిణామంగా భావించాలి. అదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు, కొందరు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని నిందిస్తున్న క్రమంలో సాక్షాత్తు ప్రధాని జాతి ముందుకొచ్చి.. పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తుందని ప్రకటించారు. దాంతో కేంద్రం మీద అవాకులు, చవాకులు పేలుతున్న వారి నోటికి తాళం వేసినట్లు అయ్యింది. జూన్ 21 నుంచి 18 ఏళ్ళ పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ కేంద్రమే అందిస్తుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

మరో వైపు కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. రెండు నెలలుగా దాదాపు అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించి, అమలుపరచిన కట్టడి ఫలితమే ఇదని భావించాలి. కోవిడ్‌–19 సెకెండ్ వేవ్ ఉదృతంగా వచ్చి ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం.. మరణాల రేటు వేగవంతమవడంతో నెలరోజుల కిందట.. దేశాన్ని అతలాకుతలం చేసింది. స్థానిక పరిస్థితుల్ని బట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆ మేర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లు ప్రకటించాయి. అవసరమైన నిర్ణయాలతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగించింది. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు.. మన దేశంలో కోవిడ్‌ థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో కేసుల సగటు తగ్గుతున్న తాజా పరిణామం ఆశాజనకమేనని చెప్పాలి. పలు రాష్ట్రాల్లో కట్టడి వివిధ స్థాయిల్లో, వేర్వేరు నమూనాల్లో ప్రస్తుతం అమలవుతోంది. కొన్ని చోట్ల సమయ పరిమితులుంటే, మరి కొన్ని చోట్ల పలు అంశాలపైన, వ్యవస్థలపైన ఈ కట్టడి పాక్షికంగానో, పూర్తిగానో కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గుతున్న పరిస్థితుల్లో కట్టడి ఉపసంహరణ ఎలా చేస్తారు? ఏ అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? తదనంతరం ఏయే జాగ్రత్తలు పాటిస్తారన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. దశల వారీ ఉపసంహరణ ప్రక్రియ అక్కడక్కడ ప్రారంభమవుతోంది. అత్యధిక కేసులు నమోదై తీవ్ర కలవరపాటుకు గురి చేసిన దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల కేసులు బాగా తగ్గిపోయాయి. ఆయా ప్రభుత్వాలు పాక్షిక ఉపసంహరణను ప్రకటించాయి. జూన్ ఏడో తేదీ నుంచి పలు రాష్ట్రాల్లో సడలింపులు అమల్లోకి వచ్చాయి. తమిళనాడు తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి మెరుగవుతోంది. ఏపీలో కొన్ని సడలింపులతో లాక్ డౌన్ పొడిగించగా.. తెలంగాణలో జూన్ 8న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పరిస్థితులు అదుపులోకి రాని తమిళనాడు, మేఘాలయ వంటి రాష్ట్రాలు కట్టడి పొడిగించాయి.

ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో పెద్ద దేశంగా చూస్తే.. మనదేశంలో సెకెండ్ వేవ్ అనుకున్నంత వేగంగానే కంట్రోల్‌లోకి వచ్చినట్టుగానే భావించాలి. దేశంలో బాగా ప్రభావం చూపిన ఆల్ఫా (బి.1.1.7), డెల్టా (బి.1.617.2) ఈ రెండు కరోనా మ్యూటెంట్ వైరస్‌లే సెకెండ్ వేవ్ ఉధృతికి కారణాలు. వైరస్‌ వ్యాప్తి నిరోధంలో ఆంక్షలతో కూడిన కట్టడి మంచి ఫలితమిచ్చిన మాట వాస్తవమేనని చెప్పాలి. అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, వైరస్‌ కట్టడి ద్వారా అటు ప్రజల ప్రాణాల్ని కాపాడాలి. కట్టడిని సడలించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించి సమాజ మనుగడనూ కాపాడాలి. వాటి మధ్య సమతూకం పాటించాలి. అవసరమైన పటిష్ట ప్రజా వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలి. వైరస్‌ ఏ వైవిధ్య రూపంలో వచ్చినా, మరే అల ఉధృతితో తోసుకువచ్చినా సమర్థంగా ఎదుర్కోగల స్థితి తీసుకురావాలి. తగిన సంఖ్యలో పరీక్షలు, పాజిటివిటీ అదుపు, మరణాల నియంత్రణ, కోలుకుంటున్న వారి సంఖ్య వృద్ధి సాధించాలి. వారంపై వారం పరిశీలన చేస్తూ, ఎపిడమాలజీ పరంగా, జీనోమ్‌ పరంగా పరిశోధనలు జరిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏది మూడో అలనో రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి. ఈ క్రమంలో చేపట్టే చర్యలకు పౌరసమాజం నిర్మాణాత్మక సహకారం అందించాలి. అప్పుడే, ఈ విపత్తు నుంచి అందరం బయటపడతాం.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!