గుడ్‌న్యూస్: బీపీ ట్యాబ్లెట్ తో కరోనా కు చెక్ !

|

May 20, 2020 | 6:25 PM

మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టేందుకు సరైన వ్యాక్సిన్ తయారు చేయటంలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు చేస్తున్నారు.

గుడ్‌న్యూస్: బీపీ ట్యాబ్లెట్ తో కరోనా కు చెక్ !
Follow us on

మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టేందుకు సరైన వ్యాక్సిన్ తయారు చేయటంలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలు ఎన్నో రకాల మందులను తయారు చేసి వాటిని ట్రయల్స్ వరకు తీసుకొచ్చాయి. ఇక వేగంగా వ్యాప్తిస్తూ..ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రజలంతా లాక్‌డౌన్, భౌతిక దూరం పాటిస్తున్నారు. వైరస్ బారినపడ్డ బాధితులను కాపాడేందుకు మరోవైపు వైద్యులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటువంటి తరుణంలో యూఎస్ కు చెందిన జాన్ హాప్కిన్స్ కిమ్మోల్ క్యాన్సర్ సెంటర్ సైంటిస్ట్ లు మంచి శుభవార్తనందించారు.

రక్తపోటును తగ్గించే ప్రజోసిన్ వైరస్ నుంచి రక్షిస్తుందని తెలిపారు. అయితే కరోనా ప్రారంభ దశలో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడవచ్చని జాన్ హాప్కిన్స్ కిమ్మోల్ క్యాన్సర్ సెంటర్ సైంటిస్ట్ లు చెబుతున్నారు. బీపీని తగ్గించే మెడిసిన్ రక్తనాళాలకు రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దీంతో వైరస్ నుంచి బాధితుల్ని కాపాడవచ్చని సైంటిస్ట్ లు చెబుతున్నారు. అయితే, ఈ మెడిసిన్ వినియోగంలోకి రావాలంటే ముందుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని వారు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రాస్తవేత్తల కృషి ఫలించి కరోనాని అంతం చేయగల వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.