మోదీ వీడియో కాన్ఫరెన్స్… కేంద్రంపై విరుచుక పడిన దీదీ

మోదీ వీడియో కాన్ఫరెన్స్... కేంద్రంపై విరుచుక పడిన దీదీ

ఈ నెల 17 అనంతరం లాక్ డౌన్ ముగిశాక ఏం చేయాలన్నదానిపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని ఈ కాన్ఫరెన్స్ లో మోదీ, విధ రాష్ట్రాల సీఎం లు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ సందర్భంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. కరోనా అంశాన్ని కేంద్రం రాజకీయం చేయాలనీ చూస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతం చూపుతోందన్నట్టు […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 5:08 PM

ఈ నెల 17 అనంతరం లాక్ డౌన్ ముగిశాక ఏం చేయాలన్నదానిపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని ఈ కాన్ఫరెన్స్ లో మోదీ, విధ రాష్ట్రాల సీఎం లు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ సందర్భంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. కరోనా అంశాన్ని కేంద్రం రాజకీయం చేయాలనీ చూస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతం చూపుతోందన్నట్టు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తమ రాష్ట్రం పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆమె అన్నారు. కాగా.. ఈ వీడియో కాన్ఫరెన్స్ రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అటు ఏపీ సీఎం జగన్.. ఈ కరోనా తరుణంలో కేంద్రం రాష్ట్రాలకు ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించాలని కోరారు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu