ఆక్స్ ఫర్డ్, సీరం సంస్థల వ్యాక్సీన్ తయారీ, ట్రయల్స్ లో ముందడుగు !

కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీ, హ్యూమన్ ట్రయల్స్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆద్వర్యంలోని 'కోవిడ్ వ్యాక్సీన్ ప్రాజెక్టు,' పూణే లోని సీరం ఇన్స్ టిట్యూట్ కొంత ముందడుగు వేశాయి. కోవిడ్ వ్యాక్సీన్ ప్రాజెక్టులో..

ఆక్స్ ఫర్డ్, సీరం సంస్థల వ్యాక్సీన్ తయారీ, ట్రయల్స్ లో ముందడుగు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 01, 2020 | 2:58 PM

కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీ, హ్యూమన్ ట్రయల్స్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆద్వర్యంలోని ‘కోవిడ్ వ్యాక్సీన్ ప్రాజెక్టు,’ పూణే లోని సీరం ఇన్స్ టిట్యూట్ కొంత ముందడుగు వేశాయి. కోవిడ్ వ్యాక్సీన్ ప్రాజెక్టులో స్వీడిష్-బ్రిటిష్ సంస్థ’ఆస్ట్రాజెనికా’ భాగస్వామిగా ఉంది. తమ కొత్త మందులు, వ్యాక్సీన్, హ్యూమన్ ట్రయల్స్ కు సంబంధించి ఈ రెండు సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఇండియాలో హ్యూమన్ ట్రయల్స్ ని నేడో, రేపో ప్రారంభించేందుకు సీరం సంస్థ సిధ్ధంగా ఉంది. కొవిడ్-19 ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తయారవుతున్న వ్యాక్సీన్ ని తీసుకోవడానికి  తహతహలాడుతున్న ఫ్రంట్ రన్నర్స్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాలంటీర్లు కూడా ఉన్నారు.

వచ్ఛే ఏడాది నాటికీ ఈ సంస్థ 100 కోట్ల వ్యాక్సీన్   డోసులను ఉత్పత్తి చేయనుందని ఆశిస్తున్నారు. ఇండియాలో ఇప్పటికే వివిధ కంపెనీలు వేర్వేరు రకాల వ్యాక్సీన్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. పోటీలు పడి మరీ రీసెర్చర్లు ఇందుకు కృషి చేస్తున్నారు. మరి… ఏ సంస్థ మేమే ఫస్ట్ అని ముందుకు వస్తుందో చూడాలి.