ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకదట

ఓ వ్యక్తి ద్వారా కుటుంబంలోని అందరికీ కరోనా వైరస్‌ సోకుతుందని చెప్పలేమని, ఆ అవకాశాలు తక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకదట
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2020 | 8:36 AM

Coronavirus Live Updates: ఓ వ్యక్తి ద్వారా కుటుంబంలోని అందరికీ కరోనా వైరస్‌ సోకుతుందని చెప్పలేమని, ఆ అవకాశాలు తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన వ్యక్తి  ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్‌ సోకకపోవచ్చని ఆ అధ్యయనంలో తెలిసింది. అందుకు కారణం వైరస్ సోకిన వారిలో నిరోధక శక్తి పెరగడమే కావొచ్చని గుజరాత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ వివరించింది.

”కరోనా వచ్చిన వ్యక్తి కలిసిన అందరికీ వైరస్‌ సోకుతుందని చెప్పలేము. అదే నిజమైతే కరోనా నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ వైరస్ సోకి ఉండాలి..? కానీ అలా జరిగిన సందర్భాలు చాలా తక్కువ. కరోనాతో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఈ వైరస్ అంటుకోని ఉదాహరణలు ఉన్నాయి” అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ మవలాంకర్‌ తెలిపారు. ఒక వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమే కారణం అవ్వొచ్చని ఆయన తెలిపారు.

Read This Story Also: కరోనాకు మెరుగైన ఫలితాలు ఇస్తోన్న ‘ఆవిరి’