ఎంత అమానుషం.. తోపుడు బండిపై ఆ త‌ల్లి అంతిమ యాత్ర.. ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు కాబ‌ట్టి

మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అంతిమయాత్ర‌లో అవమానం జరిగింది. ఆమె కొడుకులే యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోని నావల్‌పురా చౌక్‌కు చెందిన దినేష్ కుమార్ తల్లికి

ఎంత అమానుషం.. తోపుడు బండిపై ఆ త‌ల్లి అంతిమ యాత్ర.. ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు కాబ‌ట్టి
Last Journey On Cot
Follow us

|

Updated on: May 10, 2021 | 7:22 PM

మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అంతిమయాత్ర‌లో అవమానం జరిగింది. ఆమె కొడుకులే యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోని నావల్‌పురా చౌక్‌కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళగా, అక్కడ ఆమె మరణించింది.  తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు నిరాకరించారు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత వేడుకున్నా ఎవరూ ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామ‌స్తులు కూడా ఆ కుటుంబానికి స‌హ‌క‌రించ‌లేదు. దీంతో ఏమీ చేయ‌లేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై త‌ల్లి శ‌వాన్ని పెట్టుకుని శ్మ‌శానానికి తీసుకెళ్లారు. ఎవరి సాయం లేకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ త‌ల్లికి ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు కాబ‌ట్టి స‌రిపోయిందని, లేదంటే ప‌రిస్థితి ఏమిట‌ని ఈ విష‌యం తెలిసిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read: ఆంధ్రాలో కొత్త‌గా 14,986 పైగా క‌రోనా కేసులు.. మ‌ర‌ణాల సంఖ్య ఎంతంటే..