కరోనా రోగుల్లో అధికంగా కనిపిస్తోన్న లక్షణాలివే

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.

కరోనా రోగుల్లో అధికంగా కనిపిస్తోన్న లక్షణాలివే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 5:27 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇదిలా ఉంటే ఉంటే కరోనాపై అధ్యయనం చేస్తోన్న అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్థ(సీడీసీ) కరోనా రోగుల్లో ఎక్కువగా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లు వివరించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 4 వరకు 164 మందిపై పరిశోధన చేసిన వారు.. కరోనా రోగుల్లో ఎక్కువగా మూడు లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు.

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కరోనా సోకిన 96శాతం మందిలో ఈ మూడు లక్షణాల్లో ఏదో ఒకటి కనిపించిందని, 45శాతం మందిలో మూడు లక్షణాలు కనిపించాయని సీడీసీ వివరించింది. జలుబు, ఫ్లూతో కొంతమందికి కరోనా ప్రారంభం అవుతుందని సీడీసీ తెలిపింది. ఇక కరోనా సోకిన వారిలో 2- 14 రోజుల్లో జ్వరం వస్తున్నట్లు ఆ సంస్థ శాస్త్రవేత్తలు వివరించారు. మూడు రోజులు పాటు 100 డిగ్రీలకు పైనే జ్వరం ఉన్నట్లైతే కరోనా సోకినట్లేనని వారు పేర్కొన్నారు. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కరోనా సోకిన రోగుల్లో ఉన్నట్లు వారు తెలిపారు. వీటితో పాటు కండరాల నొప్పి, తలనొప్పి, చలి, కడుపు తిమ్మిరి, వికారం, జీర్ణాశయ సమస్యలను గమనించినట్లు పేర్కొన్నారు. ఇక యూకేలోని కింగ్స్ కాలేజీ అధ్యయనం ప్రకారం.. కరోనా రోగులకు ఒంటిపై చర్మ దద్దుర్లు వచ్చినట్లు తేలింది.