ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రజాప్రతినిథుల్లోనూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.

ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా

Corona Telangana Updates: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రజాప్రతినిథుల్లోనూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ నారదాసు, పఠానుచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు,  ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన పార్టీ జనరల్ సెక్రటరీల సమావేశంలో నారదాసు పాల్గొన్నారు. మరోవైపు పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి కరోనా సోకింది. ఆయనతో పాటు తల్లి, తమ్ముడు, పీఏ, గన్‌మెన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు.

Read This Story Also: ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకదట

Click on your DTH Provider to Add TV9 Telugu