యూకే సంచ‌ల‌న నిర్ణ‌యంః మాస్క్ లేకుండా బ‌య‌ట‌కొస్తే రూ.3 ల‌క్ష‌ల‌ ఫైన్!

యూకే సంచ‌ల‌న నిర్ణ‌యంః మాస్క్ లేకుండా బ‌య‌ట‌కొస్తే రూ.3 ల‌క్ష‌ల‌ ఫైన్!

ఇక క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యాకేలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఇంకా క‌ఠినంగానే అమ‌లు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే వంద పౌండ్లు జ‌రిమానా విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 రోజుల్లోగా చెల్లించాలి. అలా చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 9:53 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఎంతలా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే ఎంతో మంది పొలిటిక‌ల్ లీడ‌ర్స్, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతూనే ఉన్నారు. మ‌రికొంత మంది ఈ వైర‌స్ ప్ర‌భావం తట్టుకోలేక ప్రాణాలు వ‌దిలేస్తున్నారు. ఈ కోవిడ్ వ్యాప్తి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క్ర‌మం త‌ప్ప‌కుండా శానిటైజ‌ర్ రాసుకోవ‌డం, మాస్క్ పెట్టుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డం ప్ర‌జ‌ల జీవితాల్లో ఒక భాగ‌మైపోయింది. అందులోనూ మాస్క్ లేకుండా భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు.

ఇక క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యాకేలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఇంకా క‌ఠినంగానే అమ‌లు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే వంద పౌండ్లు జ‌రిమానా విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 రోజుల్లోగా చెల్లించాలి. అలా చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. అయితే యూకేలో ప్ర‌జ‌లు మాత్రం ఫైన్ క‌ట్టేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు కానీ మాస్క్ పెట్టుకోవ‌డం లేదు. దీంతో యూకే ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.

మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే జ‌రిమానాను వంద పౌండ్ల నుంచి మూడు వేల పౌండ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. అంటే సుమారుగా రూ.3.14 ల‌క్ష‌లు. ఇక వేడుక‌ల్లో 30 మందికి మించి ఎక్కువ మంది హాజ‌రైతే నిర్వాహ‌కుల‌కు 10 వేల పౌండ్లు జ‌రిమానా విధిస్తామ‌ని యూకే ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

Read More:

ఈ నెల 17 నుంచి ఇంట‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

బ్రేకింగ్ః క‌రోనాను జ‌యించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu