Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు

Maharashtra COVID-19 cases: మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు
Maharashtra Corona Updates
Follow us

|

Updated on: Apr 02, 2021 | 11:07 PM

Maharashtra COVID-19 cases: మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఆందోళన మరింత తీవ్రమైంది. తాజాగా కేసుల సంఖ్య అరలక్ష మార్కుకు చేరకుంది. గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 47,827 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 202 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,04,076 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 55,100 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 24,126 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,57,494 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,89,832 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా.. మహారాష్ట్రలోని పూణే, ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ముంబైలో 8,832 కేసులు నమోదు కాగా.. 20 మంది మరణించారు. పూణేలో జిల్లాలో 9,086 కేసులు నమోదు కాగా.. 58 మంది మరణించారు. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. పరిస్థితులు చేయిదాటేలా కనిపిస్తున్నాయన్నారు. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే.. రాష్ట్రంలో లాక్‌డౌన్ తప్పదంటూ పేర్కొన్నారు.

Also Read:

Lockdown: ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.

Rakesh Tikait: బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై దాడి.. నలుగురు అరెస్ట్.. ఘాజీపూర్‌లో రైతుల ఆందోళన