‘కొరోనిల్’ ట్రేడ్ మార్క్ కు మద్రాస్ హైకోర్టు బ్రేక్

కరోనా వైరస్ చికిత్స కోసమంటూ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ తయారు చేసిన కొరొనిల్ మందుకు సంబంధించి ఈ ట్రేడ్ మార్క్ కి మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ ట్రేడ్ మార్క్ ని వినియోగించుకునేందుకు పతంజలి..

'కొరోనిల్' ట్రేడ్ మార్క్ కు మద్రాస్ హైకోర్టు బ్రేక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 12:11 PM

కరోనా వైరస్ చికిత్స కోసమంటూ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ తయారు చేసిన కొరొనిల్ మందుకు సంబంధించి ఈ ట్రేడ్ మార్క్ కి మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ ట్రేడ్ మార్క్ ని వినియోగించుకునేందుకు పతంజలి సంస్థను నిరోధిస్తూ.. కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. 1993 నుంచే తాము ఈ ట్రేడ్ మార్క్ ను వాడుకుంటున్నామని, దీనిపై తమకే హక్కు ఉందని చెన్నైలోని ఆరుద్ర ఇంజనీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కార్తికేయన్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తమ ఆదేశాలు ఈ నెల 30 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. హెవీ మిషనరీలు, కంటెయిన్మెంట్ యూనిట్లను శుభ్ర పరచే కెమికల్స్ ని, శానిటైజర్లను తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆరుద్ర ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది. కొరొనిల్-213, ఎస్ పీ ఎల్ కొరొనిల్-92  బీ అనే పేరిట తమ  ట్రేడ్ మార్క్ ని తాము 1993 నుంచే వాడుకుంటున్నామని ఈ సంస్థ స్పష్టం చేసింది. దీనిపై తమకు 2027 వరకు హక్కు ఉన్నట్టు వెల్లడించింది. మా క్లయింట్లలో భెల్, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు ఉన్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి గత అయిదేళ్లుగా తమ ఉత్పత్తుల అమ్మకాల తాలూకు బిల్లులు,  రసీదులను  కూడా ఈ సంస్థ కోర్టుకు సమర్పించింది.