లాక్‌డౌన్ పొడిగింపుపై మోదీ ప్ర‌క‌ట‌న !…కిష‌న్ రెడ్డి

క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో తాజా పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోమవారం అడిగి తెలుసుకున్నారు. మే 3 వరకు పొడిగించిన రెండో దశ లాక్‌డౌన్‌కు ఇంకా..

లాక్‌డౌన్ పొడిగింపుపై మోదీ ప్ర‌క‌ట‌న !...కిష‌న్ రెడ్డి
Follow us

|

Updated on: Apr 28, 2020 | 3:13 PM

లాక్‌డౌన్ పొడిగింపుపై మే2న ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్‌తో చ‌ర్చించాక మోదీ తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు. అయితే హాట్‌స్పాట్స్‌, రెడ్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్ య‌థాత‌థంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు మాత్రం ప‌నిచేయ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. అటు క‌రోనా నియంత్ర‌ణ‌పై రెండు తెలుగు రాష్ట్రాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని కిష‌న్ రెడ్డి కితాబిచ్చారు.

క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో తాజా పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోమవారం అడిగి తెలుసుకున్నారు. మే 3 వరకు పొడిగించిన రెండో దశ లాక్‌డౌన్‌కు ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో తదుపరి చర్యలేంటనే దానిపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగిం చాల్సిందిగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరినట్టుగా తెలుస్తోంది. వారితో పాటు బిహార్‌, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే పరిస్థితి మెరుగవుతుందని ప్రదానికి సూచించారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండడం, రాబోయే రోజుల్లో మరింత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులిచ్చిన సలహాలు, సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..