లాక్‌డౌన్‌ 4.0: ఫుడ్‌ హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఇస్తూ..

  • Tv9 Telugu
  • Publish Date - 7:47 pm, Sun, 17 May 20
లాక్‌డౌన్‌ 4.0: ఫుడ్‌ హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఇస్తూ.. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా రెస్టారెంట్ల తెరిచేందుకు అనుమతి ఇవ్వని కేంద్రం, ఫుడ్ హోం డెలివరీకి మాత్రం అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు హోం డెలివరీ చేసేందుకు మాత్రమే తెరుచుకోవాలని తెలిపింది. ఇక ఈ నెలాఖరు వరకు సామూజిక సమావేశాలు, మత సభలు, ప్రార్థనా మందిరాలు బంద్ చేసింది. అలాగే భౌతిక దూరం పాటిస్తూ పెళ్లిళ్లకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇచ్చింది.

Read This Story Also:  Big Breaking: మే 31 వరకు లాక్‌డౌన్ 4.0.. అవి బంద్.. కొత్త మార్గదర్శకాలివే..!