ఏటీఎంలోకి ప…ప..పాము.. ఎంచక్కా ఎంటరైంది

ఏటీఎంలోకి ప...ప..పాము.. ఎంచక్కా ఎంటరైంది

ఢిల్లీలో ఇటీవల ఓ కోతి ఒక ఏటీఎంలో ప్రవేశించి సృష్టించిన ‘బీభత్సం’ మరిచిపోక ముందే ఇప్పుడు మరో జీవి కూడా దాదాపు అలాంటి సంచలనానికే కారణమైంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐసీఐఐసీ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోకి ఓ పొడవాటి పాము ప్రవేశించడాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ ఏటీఎంపైన గల హోల్ లోనుంచి అది మెల్లగా అవతలికి జారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కనుక.. ఇక మనం కూడా డబ్బులు […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2020 | 5:18 PM

ఢిల్లీలో ఇటీవల ఓ కోతి ఒక ఏటీఎంలో ప్రవేశించి సృష్టించిన ‘బీభత్సం’ మరిచిపోక ముందే ఇప్పుడు మరో జీవి కూడా దాదాపు అలాంటి సంచలనానికే కారణమైంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐసీఐఐసీ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోకి ఓ పొడవాటి పాము ప్రవేశించడాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ ఏటీఎంపైన గల హోల్ లోనుంచి అది మెల్లగా అవతలికి జారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కనుక.. ఇక మనం కూడా డబ్బులు తీసుకోవడానికి ‘ఎనీ టైం మనీ’ మిషన్ వద్దకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట !

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu