కరోనా క్వారంటైన్ ‘లెక్క’ పెరుగుతోందట.. కేరళ డాక్టర్ల వెల్లడి

కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి  రెట్టింపు.

కరోనా క్వారంటైన్ 'లెక్క' పెరుగుతోందట.. కేరళ డాక్టర్ల వెల్లడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 6:20 PM

కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి  రెట్టింపు.. అంటే 28 రోజులు క్వారంటైన్ అవసరమయ్యేట్టు కనిపిస్తోందని ఈ డాక్టర్లు అంటున్నారు. ఉదాహరణకు దుబాయ్ నుంచి కన్నూర్ జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడలేదని, కానీ ఈ నెల 14 న టెస్ట్ చేస్తే ‘అసలు విషయం’ బయటపడిందని ఓ డాక్టర్ తెలిపారు.  14 రోజుల పాటు  ఐసోలేషన్ లో ఉన్నా అవి తగ్గకపోవడంతో.. ఇంట్లోనే మరో 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామన్నారు. అంటే మొత్తం 28 రోజులయ్యాయి. ట్రావెల్ హిస్టరీ కారణంగా ఈ వ్యక్తికి ఇన్ని రోజుల సమయం అవసరమైందన్నారు. ఇలాగే హైరిస్క్ కేటగిరీలోనివారికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడకున్నా..తప్పనిసరిగా ఇన్ని  రోజులూ స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలన్నది ఆ డాక్టర్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దుబాయ్ నుంచి తిరిగి వఛ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా వైద్యులు 28 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ సూచించారు.

14 రోజుల క్వారంటైన్ తరువాత కూడా ఆరోగ్యంగా.. ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడని వ్యక్తులు తమకు తెలియకుండానే  ఈ  వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారన్న ఆందోళనను ఈ డాక్టర్ వ్యక్తం చేశారు. అయితే దేశంలోని ఇతర కేసుల విషయం నార్మల్ గానే ఉందని ఆయన పేర్కొన్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు