మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. రోజుకు 3 గంటల పాటు అమ్మకాలు.. కానీ అలా అయితేనే..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే. ఇప్పటికే దేశంలో వందకు పైగా మరణాలు.. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు (ఏప్రిల్ 14వరకు) లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. అయితే అకస్మాత్తుగా మద్యం షాపులు బంద్‌ అవ్వడంతో.. మద్యం ప్రియులకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:54 pm, Tue, 7 April 20
మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. రోజుకు 3 గంటల పాటు అమ్మకాలు.. కానీ అలా అయితేనే..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే. ఇప్పటికే దేశంలో వందకు పైగా మరణాలు.. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు (ఏప్రిల్ 14వరకు) లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. అయితే అకస్మాత్తుగా మద్యం షాపులు బంద్‌ అవ్వడంతో.. మద్యం ప్రియులకు షాక్ తగిలింది. అంతేకాదు.. పలుచోట్ల మద్యం లేకపోవడంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు మద్యం అమ్మకాల అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. లాక్‌డౌన్‌ ఏప్రిల్ 14న ముగియకుండా కొనసాగిస్తే.. రోజుకు మూడు గంటలపాటు మద్యం విక్రయాలు జరిపేందుకు కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది.

ఏప్రిల్ 14వతేదీ తర్వాత.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు.. మొత్తం మూడు గంటలపాటు మద్యం విక్రయించాలని ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే.. మద్యం కోసం పలుచోట్ల వైన్స్‌ షాపుల్లో చోరీలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు.. మూడు గంటలపాటు మద్యం
విక్రయించే అంశంపై ఆలోచిస్తున్నామని.. దీనిపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ యశ్వంత్ తెలిపారు.