కరోనా ఎఫెక్ట్‌.. జీశాట్-1 ప్రయోగం మళ్లీ వాయిదా..!

కరోనా మహమ్మారి అన్నింటికి ఆటంకాగానే మారుతోంది. ఈ వైరస్‌ కారణంగా.. ప్రపంచ దేశాల మధ్య.. రవాణా స్థంభించిపోయింది. దేశంలో కూడా.. విమానాలు, రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా.. ఇస్రో ప్రయోగించే ఉపగ్రాహాలకు కూడా ఈ వైరస్ సెగ తగిలింది. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో జీశాట్-1 ప్రయోగాన్ని ఇస్రో మరోసారి వాయిదా వేసినట్లు సమాచారం. జీఎస్‌ఎల్‌వీ-10 సహాయంతో.. ఈ శాటిలైట్ ఉపగ్రహాన్ని తొలుత మార్చి 5వ తేదీన ప్రయోగించాలనుకున్నా.. కొన్ని అనివార్య కారణాలతో ప్రయోగం వాయిదా […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:28 pm, Wed, 8 April 20
కరోనా ఎఫెక్ట్‌.. జీశాట్-1 ప్రయోగం మళ్లీ వాయిదా..!

కరోనా మహమ్మారి అన్నింటికి ఆటంకాగానే మారుతోంది. ఈ వైరస్‌ కారణంగా.. ప్రపంచ దేశాల మధ్య.. రవాణా స్థంభించిపోయింది. దేశంలో కూడా.. విమానాలు, రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా.. ఇస్రో ప్రయోగించే ఉపగ్రాహాలకు కూడా ఈ వైరస్ సెగ తగిలింది. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో జీశాట్-1 ప్రయోగాన్ని ఇస్రో మరోసారి వాయిదా వేసినట్లు సమాచారం. జీఎస్‌ఎల్‌వీ-10 సహాయంతో.. ఈ శాటిలైట్ ఉపగ్రహాన్ని తొలుత మార్చి 5వ తేదీన ప్రయోగించాలనుకున్నా.. కొన్ని అనివార్య కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. అయితే ఆ ప్రయోగం ఇప్పుడు ప్రయోగిద్దామనుకుంటే.. లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఈ సారి కూడా ప్రయోగానికి బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఇస్రోలోని వివిధ విభాగాల్లో కనీసం వెయ్యి మంది పనిచేస్తేనే.. ఓ ప్రయోగం విజయవంతం అవుతోంది.. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అయితే మళ్లీ ఈ ప్రయోగం షెడ్యూల్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు.