ఇండోనేషియాలో 33వేల మార్క్‌ దాటిన కరోనా కేసులు..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే 72లక్షల మందికి పైగా కరోనా సోకగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:16 pm, Tue, 9 June 20
ఇండోనేషియాలో 33వేల మార్క్‌ దాటిన కరోనా కేసులు..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే 72లక్షల మందికి పైగా కరోనా సోకగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. మరో 35 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇండోనేషియాలో మొన్నటి వరకు కేసుల సంఖ్య అత్యల్పంగానే ఉన్నా.. ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 1,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 33,076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినపడి మంగళవారం నాడు 40 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,923కి చేరింది. ఇక కరోనా నుంచి మంగళవారం నాడు 510 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 11,414కు చేరింది. ఈ విషయాన్ని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.