క‌రోనా చేసిన‌ మేలు…40 ఏళ్ల త‌ర్వాత ఇలా..

క‌రోనా చేసిన‌ మేలు...40 ఏళ్ల త‌ర్వాత ఇలా..

యావ‌త్ ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి..మిగిలిన వారి ప‌రిస్థితి ఎలా ఉన్నా..భార‌త్‌లో మాత్రం పెను మార్పును తెచ్చింది. లాక్‌డౌన్ కార‌ణంగా..40 ఏళ్ల నాటి...

Jyothi Gadda

|

May 13, 2020 | 2:20 PM

క‌రోనా మ‌నుషుల‌కు హానీ చేస్తున్నా ప‌ర్య‌వ‌ర‌ణానికి మాత్రం మేలు చేస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్ కార‌ణంగా  కాలుష్యం పూర్తిగా త‌గ్గిపోయి ప్ర‌కృతి స్వ‌చ్ఛంగా మారింది. దేశంలో 40 ఏళ్ల‌లో తొలిసారిగా కార్బ‌న్ డై ఆక్సైడ్ ఉద్గారాలు త‌గ్గిపోయాయి. కేంద్ర ఇంధ‌న‌, ప‌రిశుద్ధ్య వాయువుల ప‌రిశోధ‌న సెంట‌ర్ సీఈఆర్ఏ జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం తెలిసింది. గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో కార్బ‌న్‌డై ఆక్సైడ్ ఉద్గారాలు 30 శాతం త‌గ్గిన‌ట్లు తెలింది.

2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే..2019-20 ఆర్థిక సంవత్సరంలో కర్బన ఉద్గారాలు… 3 కోట్ల టన్నులు తగ్గినట్లు సీఈఆర్ఏ  ప‌రిశోధ‌న‌లో తేల్చారు. దేశంలో తాజాగా వాడుతున్న చమురు, గ్యాస్, బొగ్గు వాడకాల్ని లెక్కలోకి తీసుకొని ఈ అంచనాలకు వచ్చారు. దేశంలో ఎక్కువ కర్బన ఉద్గారాలు… రావాణా రంగం, విద్యుత్ రంగం నుంచే వస్తున్నాయి. ఎప్పుడైతే శిలాజ ఇంధనాల వాడకం పడిపోయిందో… అప్పటి నుంచే కర్బన ఉద్గారాల తగ్గుదల కూడా మొదలైంది. మార్చిలో దేశంలోని బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి… 15 శాతం తగ్గింది. అలాగే… ఏప్రిల్‌లోని మొదటి మూడువారాల్లో అది 31 శాతం తగ్గింది. వేర్వేరు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సమాచారాన్నిప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సీఈఆర్ ఏ నివేదిక వెల్ల‌డించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu