కరోనా వైరస్…దేశంలో సామాజిక వ్యాప్తి లేదు..ఇండియన్ మెడికల్ అసోసియేషన్

దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) మొదలైందన్న వార్తలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొట్టిపారేసింది. ఈ విధమైన ప్రకటనలను తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఈ దశ ప్రారంభమయిందా అన్న విషయాన్ని..

కరోనా వైరస్...దేశంలో సామాజిక వ్యాప్తి లేదు..ఇండియన్ మెడికల్ అసోసియేషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 5:40 PM

దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) మొదలైందన్న వార్తలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొట్టిపారేసింది. ఈ విధమైన ప్రకటనలను తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఈ దశ ప్రారంభమయిందా అన్న విషయాన్ని అధికారిక సంస్థలు నిర్ధారించవలసి ఉందని, ‘క్రౌడ్ సోర్సింగ్ డేటా’ (సామూహిక జన సందోహ సంబంధ డేటా) ..అధికారిక డేటా స్థానే రాజాలదని పేర్కొంది. అంటే అధికారికంగా నిర్ధారించి చెప్పేదే వాస్తవ డేటా అవుతుంది అని ఈ సంస్థ తెలిపింది. సామాజిక వ్యాప్తి అన్న భావజాలానికి సంబంధించిన ప్రకటనలన్నీ వ్యక్తిగత అభిప్రాయాలుగా పరిగణించవచ్ఛు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వివరించింది.

ప్రజారోగ్య శాఖ అధికారులు, వైద్య బృందాలు కూడా పూర్తిగా ఈ ఎపిడమిక్ ని అదుపు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని ఈ సంస్థ అధికారులు తెలిపారు. అర్బన్ మెట్రో ప్రాంతాల్లో మాత్రమే క్లస్టర్స్ ఉన్నాయి తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో లేవని వారు చెప్పారు. కాగా….. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 11,18,043 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,90,459 యాక్టివ్ కేసులు కాగా… 27,497 మంది కరోనా రోగులు మృతి చెందారు.