శ్రీకృష్ణావతారం ఎత్తిన క్రికెటర్ ధావన్

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌లన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులోనూ భారత్‌లో జరిగే మెగా క్రికెట్ టోర్నీ ఐపీఎల్ కూడా ప్రస్తుతానికి రద్దయ్యింది. దీంతో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకేముంది.. వారిలోని అద్భుతమైన కళలని..

  • Tv9 Telugu
  • Publish Date - 1:25 pm, Sun, 17 May 20
శ్రీకృష్ణావతారం ఎత్తిన క్రికెటర్ ధావన్

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌లన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులోనూ భారత్‌లో జరిగే మెగా క్రికెట్ టోర్నీ ఐపీఎల్ కూడా ప్రస్తుతానికి రద్దయ్యింది. దీంతో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకేముంది.. వారిలోని అద్భుతమైన కళలని బయటపెడుతున్నారు. ఇప్పటికే క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాడు. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ కూడా కృష్ణావతారమెత్తాడు.

తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తనలోని కొత్త కళను బయటపెట్టాడు. ఫ్లూట్ ఊదుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధావన్‌లో ఉన్న కొత్త కళను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సముద్రం వైపు నిలుచొని.. మైమరిచిపోతూ ఫ్లూట్ వాయించాడు. గతంలో కూడా ధావన్ పలు మార్లు ఫ్లూట్ వాయించాడు. కాగా ఇదివరకు లాక్‌డౌన్‌ విధించిన కొత్తలో ధావన్ ఇంట్లోని బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ, బట్టలు ఉతికిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A fresh start.. Trees, the wind, the ocean & some music = bliss. 🎶

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Read More:

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !