Coronavirus: హమ్మయ్యా.. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అదుపులోకి వచ్చాయ్‌.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

గత కొన్ని రోజులుగా కరోనా (Covid) కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మృతుల (Covid Deaths) సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. వైరస్‌ అదుపులోకి వస్తోన్నా మరణాల సంఖ్య అదుపులోకి రావకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది.

Coronavirus: హమ్మయ్యా.. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అదుపులోకి వచ్చాయ్‌.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Follow us

|

Updated on: Feb 11, 2022 | 10:39 AM

గత కొన్ని రోజులుగా కరోనా (Covid) కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మృతుల (Covid Deaths) సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. వైరస్‌ అదుపులోకి వస్తోన్నా మరణాల సంఖ్య అదుపులోకి రావకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే తాజాగా కరోనా మరణాలు కూడా అదుపులోకి వచ్చాయి. నిన్నటి కంటే నేడు నమోదైన మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,25,36,137 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనాయాక్టివ్ కేసులున్నాయి. కాగా కొవిడ్​ ధాటికి నిన్న మరో 657 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న నమోదైన మరణాల సంఖ్య( 1,241) కంటే నేడు దాదాపు 50 శాతం తగ్గడం ఎంతో ఊరటనిచ్చే అంశం. కాగా ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,06,520 కు చేరింది.

పెరుగుతోన్న రికవరీ రేటు..

కాగా కరోనా కేసులు తగ్గడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య అధికమవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. అదేవిధంగా రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని కేంద్రారోగ్యశాఖ వెల్లడించింది . దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,79,51,432 కొవిడ్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇక కరోనా నియంత్రణకు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,18,867 కరోనా టీకా డోసులను పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రారోగ్యశాఖ ప్రకటించింది.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.