దేశంలో తొలి ప్లాస్మా డోనర్.. మెడికల్ వరల్డ్ హర్షం

విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు తన ప్లాస్మాను ఇఛ్చి ఆదుకుంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఓ యువతి. స్మృతి ఠక్కర్ అనే ఈమె తనలాగే ఈ వ్యాధి నుంచి బయటపడినవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్-19 రోగులకు తమ రక్తంలోని యాంటీ బాడీలను ఇఛ్చి వారిని కాపాడాలని కోరుతోంది. మొదట కరోనా సోకగానే తాను ఇంటిలోనే 14 రోజుల పాటు ఐసోలేషన్ లోకి వెళ్లానని,, ఈ వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం తనకు చికిత్స […]

దేశంలో తొలి ప్లాస్మా డోనర్.. మెడికల్ వరల్డ్ హర్షం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 25, 2020 | 8:51 PM

విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు తన ప్లాస్మాను ఇఛ్చి ఆదుకుంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఓ యువతి. స్మృతి ఠక్కర్ అనే ఈమె తనలాగే ఈ వ్యాధి నుంచి బయటపడినవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్-19 రోగులకు తమ రక్తంలోని యాంటీ బాడీలను ఇఛ్చి వారిని కాపాడాలని కోరుతోంది. మొదట కరోనా సోకగానే తాను ఇంటిలోనే 14 రోజుల పాటు ఐసోలేషన్ లోకి వెళ్లానని,, ఈ వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం తనకు చికిత్స చేసిన డాక్టర్ నుంచి పిలుపు అందగానే హాస్పిటల్ కి వెళ్లి ఆయన కోర్కె మేరకు ప్లాస్మా ఇచ్చ్చానని వెల్లడించింది. ఆసుపత్రిలో కేవలం మూడు గంటలు మాత్రమే ఉన్నట్టు స్మృతి తెలిపింది. ఈమె నిర్ణయం పట్ల వైద్య రంగం హర్హం వ్యక్తం చేస్తోంది. స్మృతి లాగే కరోనా నుంచి కోలుకున్నవారు ఇతర రోగులకు తమ యాంటీ బాడీలను ఇవ్వాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.