ఇరాన్.. కరోనా చికిత్స కోసమంటూ.. ‘విషం ‘తాగి 300 మంది మృతి

కరోనా విలయం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. 197 దేశాలకు పాకిన ఈ వైరస్ అపార జన నష్టానికి కారణమవుతోంది. కంటికి కనబడని ఈ శత్రువును అణచివేయడానికి అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా బెంబేలెత్తిపోతోంది. తాజాగా ఇరాన్ దేశంలో కరోనా చికిత్సకు మంచి మందు అని భావించి ‘విషాన్ని ‘తీసుకున్న సుమారు 300 మంది మృత్యువాత పడ్డారు. మరో వెయ్యిమంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరికి కంటిచూపు పోయింది. ‘మీథనాల్ ‘ అనే నాటుసారా  వీరిపాలిట విషంగా […]

  • Umakanth Rao
  • Publish Date - 4:02 pm, Fri, 27 March 20
ఇరాన్.. కరోనా చికిత్స కోసమంటూ.. 'విషం 'తాగి 300 మంది మృతి

కరోనా విలయం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. 197 దేశాలకు పాకిన ఈ వైరస్ అపార జన నష్టానికి కారణమవుతోంది. కంటికి కనబడని ఈ శత్రువును అణచివేయడానికి అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా బెంబేలెత్తిపోతోంది. తాజాగా ఇరాన్ దేశంలో కరోనా చికిత్సకు మంచి మందు అని భావించి ‘విషాన్ని ‘తీసుకున్న సుమారు 300 మంది మృత్యువాత పడ్డారు. మరో వెయ్యిమంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరికి కంటిచూపు పోయింది. ‘మీథనాల్ ‘ అనే నాటుసారా  వీరిపాలిట విషంగా మారిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇది తాగినా లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నా కరోనా రాదనీ, ఇది మంచి ‘ఔషధమని’ అక్రమ ఆల్కహాల్ వ్యాపారులు  జనాలను నమ్మించారు. ఆ దేశంలో ఆల్కహాల్ తాగడం నిషిధ్ధం.  ఇది కూడా వారికి వరమైంది. అమాయకప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ చీప్ లిక్కర్ అమ్మకాలను సాగించారు. అయితే ఇది సేవించిన అనేకమంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. కరోనా చికిత్స కాదుకదా తమ ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. కరోనా వల్ల ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో అక్రమ ఆల్కహాల్ వ్యాపారులు రెచ్చిపోయారు. కరోనాను అడ్డుపెట్టుకుని వారు మీథనాల్ అమ్మకాలను ఇబ్బడిముబ్బడి చేశారు. కరోనా కారణంగా ఇరాన్ లో ఇంకా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా .. ఆ దేశ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.