అక్క కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి.. లివర్ మార్పిడితో చెల్లి సేఫ్ !

ఢిల్లీలో ఓ విచిత్రం జరిగింది. బహుశా వైద్య శాస్త్రాల చరిత్రలోనే ఇదే మొదటిసారి.. ఇదో అద్భుతం ! కరోనా వ్యాధినుంచి కోలుకున్న ఓ అక్క.... తన చెల్లెలికి తన కాలేయంలో కొంత భాగాన్ని డొనేట్ చేసి ఆమె ప్రాణాన్ని కాపాడింది. 13 ఏళ్ళ ఆ బాలికకు..

అక్క కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి.. లివర్ మార్పిడితో  చెల్లి సేఫ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2020 | 1:00 PM

ఢిల్లీలో ఓ విచిత్రం జరిగింది. బహుశా వైద్య శాస్త్రాల చరిత్రలోనే ఇదే మొదటిసారి.. ఇదో అద్భుతం ! కరోనా వ్యాధినుంచి కోలుకున్న ఓ అక్క…. తన చెల్లెలికి తన కాలేయంలో కొంత భాగాన్ని డొనేట్ చేసి ఆమె ప్రాణాన్ని కాపాడింది. 13 ఏళ్ళ ఆ బాలికకు ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. గత మే 20 న మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఈ సర్జరీకి మూడు వారాల ముందే కరోనా నుంచి ఈమె అక్క పూర్తిగా కోలుకుందట. నిజానికి ఈ సర్జరీ గత మార్చి నెలలోనే జరగాల్సి ఉందని, కానీ రెండు రోజుల ముందే ఆ సోదరి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. అయితే ఆమెలో ఎలాంటి అనారోగ్యమూ బయటపడలేదని, ఎసింప్టోమాటిక్ అని గ్రహింఛామని వారు పేర్కొన్నారు. అటు..చెల్లెలి పరిస్థితి రోజురోజుకీ విషమంగా మారుతూ వచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా కాలేయ మార్పిడి జరగకపోతే ప్రమాదమే అని కూడా అభిప్రాయపడ్డారు. . పైగా లివర్ ఇచ్ఛే డోనర్లు త్వరగా లభ్యం కావాలి కూడా..

ఈ బాలిక అరుదైన ‘కెరోలీ డిసీజ్’ కి గురై జ్వరం, ఇన్ఫెక్షన్ తో ఆరు నెలలుగా బాధ పడుతోందని, ఈమె సోదరి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఆమె లివర్ మార్పిడి తో ఈ బాలికను కాపాడవచ్ఛు నని భావించి సర్జరీ చేశామని గుప్తా అనే డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరూ కోలుకుంటున్నారని, మరో మూడు, నాల్గు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఆయన చెప్పారు. దేశంలో ఈ విధమైన లివర్ ట్రాన్స్ ప్లాంట్ జరగడం ఇదే మొదటిసారని డాక్టర్ గుప్తా అంటున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన