పనిమనిషి మరణం.. అంత్యక్రియలు నిర్వహించిన గౌతమ్ గంభీర్

తన ఇంట్లో ఆరు సంవత్సరాలుగా పని చేస్తున్న సరస్వతి పాత్ర అనే మహిళ మరణించడంతో క్రికెటర్, లోక్ సభ బీజేపీ ఎంపీ కూడా అయిన గౌతమ్ గంభీర్ చలించిపోయాడు. ఆమె కేవలం తమ ఇంటి పనిమనిషి కాదని, తమ కుటుంబ సభ్యురాలని ఆవేదనగా ట్వీట్ చేశాడు. ఆమె అంత్య క్రియలు నిర్వహించడం తన బాధ్యత అని పేర్కొన్నాడు. మతం, కులం, సోషల్ స్టేటస్, ఏదైనా సరే.. మెరుగైన సమాజం కోసం మనం కృషి చేయాలి అని అన్నాడు. […]

పనిమనిషి మరణం.. అంత్యక్రియలు నిర్వహించిన గౌతమ్ గంభీర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 24, 2020 | 8:32 PM

తన ఇంట్లో ఆరు సంవత్సరాలుగా పని చేస్తున్న సరస్వతి పాత్ర అనే మహిళ మరణించడంతో క్రికెటర్, లోక్ సభ బీజేపీ ఎంపీ కూడా అయిన గౌతమ్ గంభీర్ చలించిపోయాడు. ఆమె కేవలం తమ ఇంటి పనిమనిషి కాదని, తమ కుటుంబ సభ్యురాలని ఆవేదనగా ట్వీట్ చేశాడు. ఆమె అంత్య క్రియలు నిర్వహించడం తన బాధ్యత అని పేర్కొన్నాడు. మతం, కులం, సోషల్ స్టేటస్, ఏదైనా సరే.. మెరుగైన సమాజం కోసం మనం కృషి చేయాలి అని అన్నాడు. ఒడిశాకు చెందిన సరస్వతి పాత్ర కొంతకాలంగా అస్వస్థురాలిగా ఉంది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21 న మరణించింది. లాక్ డౌన్ కారణంగా ఆమె అస్థికలను ఆమె స్వరాష్ట్రానికి పంపలేకపోయానని గౌతమ్ గంభీర్ విచారం వ్యక్తం చేశాడు.