కరోనా చికిత్సలో యాంటీ ఎబోలా మందు..

కరోనా వ్యాధి చికిత్సకు యాంటీ ఎబోలా మెడిసిన్ బాగా పని చేస్తుందని వెల్లడయింది. బ్రిటన్ లో ఈ మందును సుమారు 53 మంది పేషంట్లకు ఇవ్వగా వారిలో దాదాపు 19 మంది కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.

కరోనా చికిత్సలో యాంటీ ఎబోలా మందు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2020 | 7:44 PM

కరోనా వ్యాధి చికిత్సకు యాంటీ ఎబోలా మెడిసిన్ బాగా పని చేస్తుందని వెల్లడయింది. బ్రిటన్ లో ఈ మందును సుమారు 53 మంది పేషంట్లకు ఇవ్వగా వారిలో దాదాపు 19 మంది కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. ‘గిలెడ్ సైన్సెస్’ కంపెనీ తయారు చేసిన ఈ మెడిసిన్ ని ‘రెమ్ డెసివిర్’ అని   కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా పారా సిటిమాల్ కరోనా చికిత్సలో ఉపకరిస్తాయని భావిస్తూ వచ్చామని, అయితే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాటికన్నా ఈ యాంటీ ఎబోలా మందు బాగా పని చేస్తుందన్న అంచనాకు వచ్చామని  అనుభవజ్ఞులైన డాక్టర్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఆఫ్రికా దేశాన్ని వణికించిన ఎబోలా వైరస్ ను అదుపు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా గల ప్రముఖ ల్యాబ్ లలో లెక్కలేనన్ని  క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు, చివరకు గిలెడ్ సైన్సెస్ కంపెనీ ఉత్పత్తి చేసిన రెమ్ డెసివిర్ నాణ్యమైనదని తేల్చారు. ఈ మందును రోగులకు వాడినందువల్ల కలిగిన ఫలితాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. గిలెడ్ సైన్సెస్ ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఈ మెడిసిన్ ని సుమారు 1700 మంది రోగులకు ఇచ్చిందని, అయితే ముఖ్యంగా 53 మందికి ఇంట్రా వీనస్ ద్వారా 10 రోజుల పాటు ఇఛ్చిన అనంతరం వారికి పెద్దగా ఆక్సిజన్ గానీ, వెంటిలేటర్ గానీ అవసరం లేకపోయిందని నిపుణులు తెలిపారు. ఈ రోగుల్లో 23 నుంచి 82 ఏళ్ళ వయస్సు గలవారున్నారు. వృధ్ధ రోగుల ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించిందని వెల్లడైంది.