గుడ్‌న్యూస్‌.. ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..

గుడ్‌న్యూస్‌.. ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు అత్యవసర సర్వీసులు మినహా.. అన్ని మూతపడ్డాయి. దీంతో.. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు శ్రీకారం చుట్టింది. మంగళవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2020 | 11:15 AM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు అత్యవసర సర్వీసులు మినహా.. అన్ని మూతపడ్డాయి. దీంతో.. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు శ్రీకారం చుట్టింది. మంగళవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ గురించి కీలక ప్రకటన చేయబోతున్నారు. ఈ ప్యాకేజీని ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నారన్నది సాయంత్రి చెప్పబోతున్నారు. అంతేకాదు.. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయన్నది వివరించనున్నారు. ఇక ఇప్పటికే పారిశ్రామిక రంగం కుదేలైపోయిన  సంగతి తెలిసిందే. ఈ పారిశ్రామిక రంగాన్ని మళ్లీ ఊపందించేలా ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu