అక్క‌డ క‌రోనా తొలి పాజిటివ్ కేసు..

అక్క‌డ క‌రోనా తొలి పాజిటివ్ కేసు..

ప్ర‌పంచ దేశాల‌ను హ‌డ‌లెత్తిస్తున్న క‌రోనా ర‌క్క‌సి భార‌త్‌లోనూ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రోజురోజుకూ విస్త‌రిస్తూ త‌న ప్ర‌తాపం చూపెడుతోంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని రాష్ట్రాల‌కు కూడా ఎగ‌బాకుతోంది.

Jyothi Gadda

|

Apr 13, 2020 | 3:16 PM

ప్ర‌పంచ దేశాల‌ను హ‌డ‌లెత్తిస్తున్న క‌రోనా ర‌క్క‌సి భార‌త్‌లోనూ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రోజురోజుకూ విస్త‌రిస్తూ త‌న ప్ర‌తాపం చూపెడుతోంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని రాష్ట్రాల‌కు కూడా ఎగ‌బాకుతోంది. తాజాగా నాగాలాండ్‌లో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. దీంతో ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.
కోవిడ్ భూతం పంజా ఇప్పుడు నాగాలాండ్‌పై ప‌డింది. నాగాలాండ్‌లో మొట్టమొదటి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. నాగాలాండ్‌ దిమాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన రోగికి క‌రోనా వైర‌స్‌ లక్షణాలు కనిపించడంతో అతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు వెల్ల‌డించారు. దీంతో అతడిని అస్సాంలోని గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమానితులుగా భావిస్తున్న మ‌రో 74 మంది శాంపిల్స్‌ని  సేక‌రించిన వైద్యులు ప‌రీక్షిస్తున్నారు. ఈ మేర‌కు  నాగాలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ ఆదివారం రాత్రి ట్విటర్‌లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగ ఉందని మంత్రి పేర్కొన్నారు. కాగా బాధితుడు దిమాపూర్‌కు చెందిని వాడని, అతను మొదట ఆరోనాగ్యం కారణంగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు అస్సాం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu