గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్‌ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు

ఈ నెల 27వ తేదీన‌ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి నుంచి పరారైన న‌లుగురు కోవిడ్ పాజిటివ్ ఖైదీల కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆ న‌లుగురి ఖైదీల పేర్ల‌ను కూడా వెల్ల‌డించారు. అబ్దుల్ అర్బాజ్, జావీద్, సోమ సుందర్, నరసయ్య అనే ఖైదీలకు పాజిటివ్ సోక‌డంతో..

  • Tv9 Telugu
  • Publish Date - 3:55 pm, Fri, 28 August 20
గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్‌ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు

ఈ నెల 27వ తేదీన‌ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి నుంచి పరారైన న‌లుగురు కోవిడ్ పాజిటివ్ ఖైదీల కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆ న‌లుగురి ఖైదీల పేర్ల‌ను కూడా వెల్ల‌డించారు. అబ్దుల్ అర్బాజ్, జావీద్, సోమ సుందర్, నరసయ్య అనే ఖైదీలకు పాజిటివ్ సోక‌డంతో చ‌ర్ల‌ప‌ల్లి జైలు అధికారులు గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ఈ న‌లుగురు ఖైదీలు.. ఆస్ప‌త్రి నుంచి త‌ప్పించుకుని పారిపోయారు. వీరితో పాటు మ‌రో 20 ఖైదీలు అదే ఆస్ప‌త్రిలో క‌రోనా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 27వ తేదీ తెల్ల‌వారు జామున 3 గంట‌ల స‌మ‌యంలో గాంధీ ఆస్ప‌త్రి ప్ర‌ధాన భ‌వ‌నం రెండో అంత‌స్తులోని బాత్రూమ్స్ గ్రిల్స్ తొల‌గించి ఈ ఖైదీలు త‌ప్పించుకున్నారు. అయితే ఆస్ప‌త్రిలోని సీసీటీవీ ఫుటేజీ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో నిందితుల దృశ్యాలు రికార్డు కాలేదు. ప‌రారైన ఖైదీల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Read More:

హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’