ఆ న్యూస్ ఫేక్.. ఏపీకి చెందిన వైరల్‌ వీడియోపై తెలంగాణ ఫాక్ట్‌చెక్‌ క్లారిటీ..!

ఆ న్యూస్ ఫేక్.. ఏపీకి చెందిన వైరల్‌ వీడియోపై తెలంగాణ ఫాక్ట్‌చెక్‌ క్లారిటీ..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు వీడియోలు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఫేక్‌ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో నిజానిజాలను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 3:02 PM

కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు వీడియోలు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఫేక్‌ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో నిజానిజాలను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఫాక్ట్‌చెక్‌ పేరుతో నడుస్తోన్న ఈ వెబ్‌సైట్.. తాజాగా ఏపీకి చెందిన వైరల్ వీడియోపై స్పందించింది. ఆ వీడియో ఫేక్‌ అని తేల్చేసింది.

కాగా కరోనా నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చారని.. ముస్లింలు పాదరక్షలుతోనే అందులో తిరుగుతున్నారని ఓ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంపై కూడా ఎన్నో విమర్శలు వినిపించాయి. దేవాలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చడం ఏంటని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఫాక్ట్‌చెక్‌.. ఆ వీడియో ఫేక్‌ అని స్పష్టం చేసింది. అది దేవాలయం కాదని.. శ్రీ గణేష్ సాదన్‌ పేరుతో ఉన్న ఓ లాడ్జ్‌ అని పేర్కొంది. ఆ లాడ్జ్‌ను ఏపీ ప్రభుత్వం క్వారంటైన్‌ సెంటర్‌గా నడుపుతుందని వివరించింది.

అంతేకాదు ఉత్తర్‌ ప్రదేశ్‌లో వందన తివారీ అనే డాక్టర్.. ముస్లింల దాడిలో మరణించినట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. కరోనా వైరస్‌ గురించి అవగాహన కలిగించేందుకు ఆమె ముస్లిం వద్దకు వెళ్లగా.. వారు దాడి చేశారని ఆ క్రమంలో ఆమె మరణించిందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఫాక్ట్‌చెక్‌ స్పందించింది. వందనా తివారీ ఓ ఫార్మాసిస్ట్ అని.. మెదడు రక్తస్రావం అవ్వడం వలన ఆమె మరణించిందని స్పష్టం చేసింది.

Read This Story Also: పవన్‌ దర్శకుడికి ఓకే చెప్పిన చిరు.. అన్నీ కుదిరితే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu