కరోనా సాకుతో నిఘా..ఆరోగ్య సేతు లక్ష్యమే అది.. శశిథరూర్

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ వినియోగించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పు పట్టారు. ప్రజలపై నిఘా పెట్టేందుకు, కరోనా సాకుతో వాడుకుంటున్నారని, ఇది సరి కాదని ఆయన ట్వీట్ చేశారు. వ్యక్తుల ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తుందన్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి  కదలికలపైనా నిఘా ఏర్పాటు చేయడానికే ఈ యాప్ అని ఆరోపించారు. ఇటీవలే ఇదే పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈ యాప్ పట్ల […]

కరోనా సాకుతో నిఘా..ఆరోగ్య సేతు లక్ష్యమే అది.. శశిథరూర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 04, 2020 | 8:04 PM

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ వినియోగించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పు పట్టారు. ప్రజలపై నిఘా పెట్టేందుకు, కరోనా సాకుతో వాడుకుంటున్నారని, ఇది సరి కాదని ఆయన ట్వీట్ చేశారు. వ్యక్తుల ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తుందన్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి  కదలికలపైనా నిఘా ఏర్పాటు చేయడానికే ఈ యాప్ అని ఆరోపించారు. ఇటీవలే ఇదే పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈ యాప్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కూడా ఇది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేంచేందుకే అన్నట్టు ట్వీట్ చేశారు. అయితే కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణలను ఖండించారు. కరోనా పట్ల, ఈ పాజిటివ్ లక్షణాలు కలిగి ఉన్నవారి గురించి వ్యక్తులను  అప్రమత్తం చేయడానికే ఈ యాప్ ఉపయోగపడుతుందని, అంతే తప్ప దీనిపై ఆందోళన అనవసరమని వారన్నారు. రాహుల్ గాంధీ రోజూ అబధ్ధాలే చెబుతుంటారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.