సిమెంట్ మిక్సర్ లో వలస కూలీల ప్రయాణం.. సాగని గమ్యం

లాక్ డౌన్ కారణంగా వలస కూలీల కష్టాలు ఇన్నీఅన్ని కావు. పలు రాష్ట్రాలు లక్షలాది వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నా.. అవి చాలకనో, మరో కారణంవల్లో అనేకమంది తమకు తోచిన వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ విషయానికే వస్తే.. ఓ పెద్ద సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లో తమ గ్రామాలకు వెళ్తున్న 18 మంది శ్రామిక జీవులు పోలీసుల కంటబడ్డారు. ఇండోర్-ఉజ్జయిని సరిహద్దుల్లో ఈ వాహనం ప్రయాణిస్తుండగా.. అక్కడ […]

  • Umakanth Rao
  • Publish Date - 4:35 pm, Sat, 2 May 20
సిమెంట్ మిక్సర్ లో వలస కూలీల ప్రయాణం.. సాగని గమ్యం

లాక్ డౌన్ కారణంగా వలస కూలీల కష్టాలు ఇన్నీఅన్ని కావు. పలు రాష్ట్రాలు లక్షలాది వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నా.. అవి చాలకనో, మరో కారణంవల్లో అనేకమంది తమకు తోచిన వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ విషయానికే వస్తే.. ఓ పెద్ద సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లో తమ గ్రామాలకు వెళ్తున్న 18 మంది శ్రామిక జీవులు పోలీసుల కంటబడ్డారు. ఇండోర్-ఉజ్జయిని సరిహద్దుల్లో ఈ వాహనం ప్రయాణిస్తుండగా.. అక్కడ నిఘా ఉన్న పోలీసులు  దాన్ని ఆపి చెక్ చేశారు. ఈ వాహనంలోని డ్రమ్ములో వీరంతా ‘దాక్కుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఖాకీలు. ఇక తప్పదని వలసదారులంతా ఆ డ్రమ్ము నుంచి ఒక్కొక్కరుగా  బయటపడ్డారు.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వాహనాన్ని పోలీసులు తమ స్టేషన్ కు తరలించి ఈ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిని క్వారంటైన్ కి తరలించారు. అయితే స్క్రీనింగ్ అనంతరం అమాయకులైన వీరిని వారి గ్రామాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.