Benefits Of Clove Tea: పోపుల పెట్టె మన ఆయుర్వేదశాల.. లవంగ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటి ఆరోగ్యాన్ని కాలంతో పాటు వేగంగా పరుగులు తీస్తూ పట్టించుకోవడంలేదు. అయితే మన వంటింట్లోని వంటదినుసులతోనే..

Benefits Of Clove Tea: పోపుల పెట్టె మన ఆయుర్వేదశాల.. లవంగ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా
Follow us

|

Updated on: Jan 09, 2021 | 12:03 PM

Benefits Of Clove Tea: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటి ఆరోగ్యాన్ని కాలంతో పాటు వేగంగా పరుగులు తీస్తూ పట్టించుకోవడంలేదు. అయితే మన వంటింట్లోని వంటదినుసులతోనే ఆరోగ్యాన్ని కాపాడాకోవచ్చు. పోపుల పెట్టె ఆయుర్వేదశాల ఈ విషయం తెలిసినా మనం అపనమ్మకంతో చిన్న చిన్న రోగాలకే హాస్పిటల్స్‌కి పరుగులు తీస్తుంటాము. అయితే పోపులపెట్టిలోని కొన్ని వస్తువులను కొన్నింటిని రోజూ కాకపోయినా వారానికి ఒకటీ, రెండుసార్లైనా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లవంగ.. దీనిని మసాలా దినుసుల్లో ఒకటిగా ఎక్కువగా ఉపయోగిస్తాము. కానీ లవంగంతో టీ తయారు చేసుకోవచ్చనే విషయం కొంతమందికే తెలుసు. ఈ టీని వారంలో రెండు మూడు సార్లు తాగితే ఎన్నో శరీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగ టీ తయారీ విధానం :

ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 4 లేక 5 లవంగాలు తీసుకుని బాగా మరిగించాలి. అలా 10 నుంచి 15 నిమిషాలు మరిగించిన ఆ లవంగ నీరు గోరువెచ్చగా అయ్యేవరకూ ఉంచి .. అనంతరం అందులో కొంచెం తేనె , నిమ్మరసం కలిపి తీసుకోవాలి.

లవంగ టీ వల్ల ఉపయోగాలు:

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వారికి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. సీజనల్ వ్యాధులైన జ్వరం, దగ్గు, జలుబులను దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీనుంచి రిలీఫ్ వస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి నివారణ పొందవచ్చు. షుగర్ వ్యాధి కలవారికి బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్‌లో వుంచుతుంది. అధిక బరువుని తగ్గిస్తుంది. అంతేకాదు.. జుట్టుకి పట్టిస్తే కూడా మంచిది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తల స్నానం అనంతరం తేనె కలపని టీని జుట్టుకు అప్లై చేస్తే మృదువుగా ఉంటుంది. అంతేకాదు.. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ వాష్‌ను అధికంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఈ టీ మంచి హ్యాండ్‌వాష్‌గా పని చేస్తుంది. యాంటీ బాక్టీరియ గుణాలను కలిగి వుండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది.

Also Read: ఏపీలో ఈనెల 18 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఏప్రిల్, మేలో పరీక్షలు జరిగే అవకాశం

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు