83 మంది తబ్లీఘీ జమాత్ విదేశీ సభ్యులపై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్

ఢిల్లీ తబ్లీఘీ జమాత్ సభ్యులపై క్రైమ్ బ్రాంచి పోలీసులు ఉచ్ఛు బిగిస్తున్నారు. 83 మంది విదేశీ సభ్యులపై 20 ఛార్జి షీట్లను వారు సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్నారు. వీరిలో 10 మంది సౌదీ అరేబియాకు, 8 మంది బ్రెజిల్ కిచెందివారు. ఈ ఏడాది మార్చిలో ఈ నగరంలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో వీరు కూడా ఉన్నారు. అప్పుడే దేశంలో కరోనా వైరస్ ప్రబలమవుతున్న నేపథ్యంలో.. నలుగురికి మించి ఎవరూ గుమికూడదన్న […]

83 మంది తబ్లీఘీ జమాత్ విదేశీ సభ్యులపై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 4:47 PM

ఢిల్లీ తబ్లీఘీ జమాత్ సభ్యులపై క్రైమ్ బ్రాంచి పోలీసులు ఉచ్ఛు బిగిస్తున్నారు. 83 మంది విదేశీ సభ్యులపై 20 ఛార్జి షీట్లను వారు సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్నారు. వీరిలో 10 మంది సౌదీ అరేబియాకు, 8 మంది బ్రెజిల్ కిచెందివారు. ఈ ఏడాది మార్చిలో ఈ నగరంలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో వీరు కూడా ఉన్నారు. అప్పుడే దేశంలో కరోనా వైరస్ ప్రబలమవుతున్న నేపథ్యంలో.. నలుగురికి మించి ఎవరూ గుమికూడదన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీరంతా మర్కజ్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహచరులైన అయిదుగురి పాస్ పోర్టులను, వారి డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం గమనార్హం.

జమాత్ లో సభ్యత్వం ఉన్న విదేశీయులందరి ఇంటరాగేషన్ ని తాము పూర్తి చేసినట్టు పోలీసులు తెలిపారు. మౌలానా సూచనపైనే తాము మార్చి 20 తరువాత కూడా మర్కజ్ లోనే ఉన్నామని ఈ విదేశీయుల్లో పలువురు వెల్లడించారు. మర్కజ్ కు సంబంధించిన పలు బ్యాంకు అకౌంట్లను కూడా ఖాకీలు కనుగొన్నారు. అనేక గల్ఫ్ దేశాల నుంచి ఈ సంస్థకు నిధులు అందుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ నెల 5 నే మౌలానా కొడుకులను కూడా పోలీసులు ప్రశ్నించి.. మార్చి మొదటివారంలో మతపరమైన కార్యక్రమాలకు ఎవరెవరు అటెండ్ అయ్యారన్న విషయాన్ని, అలాగే మేనేజింగ్ కమిటీతో వారికి సంబంధం ఉందా అన్న అంశాన్ని కూడా తెలుసుకున్నారు. ఇక నిజాముద్దీన్ గేదరింగ్ సమయంలో 1640 మంది విదేశీ తబ్లీఘీ జమాత్  సభ్యులు ఉన్నట్టు ఈనెల 15 న ‘జమియాథ్-ఉలేమా-ఏ-హింద్’ అనే ముస్లిం సంస్థ తెలిపింది. వీరంతా 47 దేశాలకు చెందినవారని ఈ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ వెల్లడించారు. ఈ సభ్యుల్లో 64 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని, వీరిలో ఇద్దరు మరణించారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల గురించి ప్రస్తావించినప్పుడు జమాత్ అంశాలను కూడా హైలైట్ చేయడంతో ముస్లిముల పట్ల ద్వేష భావం పెరగడానికి అది దారి తీసిందని ఆయన అన్నారు.తొలుత మౌలానా సాద్ పైన, ఇతరులపైనా ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ (1897) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ నెలారంభంలో సుమారు 700 మంది విదేశీ జమాత్ సభ్యుల నుంచి సంబంధిత డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్న  విషయం గమనార్హం.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..