ఫస్ట్ ప్రియారిటీ ఢిల్లీకే ఇవ్వాలి.. కోవిడ్ వ్యాక్సిన్‌పై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వస్తే..

  • Shiva Prajapati
  • Publish Date - 3:02 pm, Sun, 29 November 20
ఫస్ట్ ప్రియారిటీ ఢిల్లీకే ఇవ్వాలి.. కోవిడ్ వ్యాక్సిన్‌పై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వస్తే.. ఢిల్లీ జనాభా మొత్తానికి ఆ వ్యాక్సిన్ అందించేందుకు 3 లేదా 4 వారాలు పడుతుందని చెప్పారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన సత్యేంద్రజైన్.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై స్పందించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని, 1200 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఢిల్లీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి సత్యేంద్రజైన్ కోరారు. ఒకసారి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ ప్రజలందరికీ కొద్ది వారాల వ్యవధిలోనే దానిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ నిల్వ గురించి ఆందోళనే అవసరం లేదన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు జనాభా మొత్తానికి వ్యాక్సిన్ అందించే స్థాయిలో ఉన్నాయన్నారు. పాలీక్లీనిక్స్, మొహొల్లా క్లీనిక్స్, డిస్పెన్సరీలు, ఆస్పత్రులు వంటి వైద్య సదుపాయాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.