వరల్డ్ అప్డేట్: 29 లక్షల కరోనా కేసులు, 2.03 లక్షల మృతులు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,921,439 చేరింది. అటు గడిచిన […]

వరల్డ్ అప్డేట్: 29 లక్షల కరోనా కేసులు, 2.03 లక్షల మృతులు..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 10:14 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,921,439 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 90,722 కేసులు నమోదు కావడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 203,289 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 836,978 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(960,896), మరణాలు(54,265) అమెరికాలోనే నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 26,496 కేసులు నమోదు కాగా.. 825 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 960,896 కేసులు, 54,265 మరణాలు
  • స్పెయిన్ – 223,759 కేసులు, 22,902 మరణాలు
  • ఇటలీ – 195,351 కేసులు, 26,384 మరణాలు
  • ఫ్రాన్స్ – 161,488 కేసులు, 22,614 మరణాలు
  • జర్మనీ – 156,513 కేసులు, 5,877 మరణాలు
  • బ్రిటన్ – 148,377 కేసులు, 20,319 మరణాలు
  • టర్కీ – 107,773 కేసులు, 2,706 మరణాలు
  • ఇరాన్ – 89,328 కేసులు, 5,650 మరణాలు
  • చైనా – 82,827 కేసులు, 4,632 మరణాలు
  • ఇండియా – 26,496 కేసులు, 825 మరణాలు

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..