క‌రోనా అల‌ర్ట్ః ఆ ఒక్క జిల్లాలోనే సెంచ‌రీ దాటిన పాజిటివ్ కేసులు

క‌రోనా అల‌ర్ట్ః ఆ ఒక్క జిల్లాలోనే సెంచ‌రీ దాటిన పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకునేలోపుగానే పంజా విసురుతోంది. ఏపీలో  ఒక్క‌సారిగా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయింది. ఆ ఒక్క జిల్లాలోనే కోవిడ్ కేసులు సెంచ‌రీ దాటేశాయి.

Jyothi Gadda

|

Apr 14, 2020 | 1:04 PM

ఏపీలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. రోజురోజుకూ విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి ప్ర‌తాపం చూపుతోంది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకునేలోపుగానే పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒక్క‌సారిగా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయింది. ఒక్క అమ‌రావ‌తి జిల్లాలోనే కోవిడ్ కేసుల సంఖ్య‌ సెంచ‌రీ దాటేసింది.

కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కరోనా పరీక్షల్లో.. మరో 34 కేసులు బయటపడ్డాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కు చేరింది. తాజాగా బయటపడ్డ 34 కేసుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకంగా 16 కేసులు నమోదయ్యాయి. కృష్ణలో 8 – కర్నూలులో 7 – అనంతపురంలో 2 – నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల్లో గుంటూరు అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే కేసులు కూడా 100 దాటి న‌మోదుకావ‌టంతో జిల్లా వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు.

కేవ‌లం ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు 109 కేసులు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనల్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. 9 మంది చనిపోయారు. కరోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంటింటి స‌ర్వే చేప‌ట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క‌క‌రికి మూడు మాస్క్‌ల చొప్పున పంపిణీ చేప‌ట్టింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సూచిస్తోంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తోంది. కాగా, శ్రీకాకుళం – విజయనగరం జిల్లాలు ఇప్ప‌టి దాకా క‌రోనా కంట‌బ‌డ‌కుండా త‌ప్పించుకున్నాయి. ఇప్ప‌టి దాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu