క‌రోనా ఎఫెక్ట్ః అధ్యాపకులకు త్వ‌ర‌లో కార్పొరేట్ షాక్

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎఫెక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్లు, జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర్ల‌పై ప‌డింది. 2020-21 సంవ‌త్స‌రానికి ముందే కొన్ని కాలేజీలు, స్కూళ్లు

క‌రోనా ఎఫెక్ట్ః అధ్యాపకులకు త్వ‌ర‌లో కార్పొరేట్ షాక్
Follow us

|

Updated on: May 12, 2020 | 4:05 PM

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త్‌ను వ‌ణికిస్తోంది. స‌రైన వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో నివార‌ణ ఒక్క‌టే మార్గం అని భావించి ఆయా దేశాల ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి. గ‌త రెండు నెల‌లుగా సుమారుగా అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో వ‌ల‌స కూలీలు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ప‌రిస్థితి దారుణంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎఫెక్ట్ బ‌డిపంతుళ్ల‌పై ప‌డింది.

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎఫెక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్లు, జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర్ల‌పై ప‌డింది. 2020-21 సంవ‌త్స‌రానికి ముందే కొన్ని కాలేజీలు, స్కూళ్లు త‌మ స్టాఫ్‌ని త‌గ్గించే యోచ‌న‌లో ఉన్నాయ‌ట‌. ఆయా విద్యాసంస్థ‌లు నిర్వ‌హిస్తున్న ఏరియాల్లో క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉన్న కార‌ణంగా విద్యార్థుల అడ్మిష‌న్లు కూడా త‌గ్గిపోయే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఆయా య‌జ‌మాన్యాలు..ముంద‌స్తుగానే నిర్వ‌హ‌ణ భారాన్ని త‌గ్గించుకునే ప‌నిలో ప‌డ్డాయ‌ట‌. ఈ మేర‌కు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి సుమారుగా 40 శాతం సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొల‌గించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు ప్రైవేటు ఉద్యోగులు, టీచ‌ర్లు చెబుతున్నారు.

క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే త‌మ‌కు ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వ‌లేద‌ని మ‌రికొంద‌రు ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్లు, సిబ్బంది వాపోయారు. పైగా ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించ‌కుండానే అందులో స‌గం జీతం కోత విధిస్తున్న‌ట్లు యాజ‌మాన్యాలు ప్ర‌క‌టించాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీతాలు లేక, ఉన్న ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యంతో చాలా మంది టీచ‌ర్లు, లెక్చ‌ర్లు మ‌న‌స్తాపానికి గుర‌వుతున్నారు. త‌మ‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??