Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఇందులో 6,565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. ఇక ఇప్పటివరకు 643 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. అటు ఈ వైరస్ బారిన పడి 239 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,035 కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా.. 40 మంది మృతి చెందారు. దీనితో నిన్న ఒక్క రోజులో అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, ఢిల్లీలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 1574 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య కూడా 110కి చేరింది. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు 473 కేసులు నమోదు కాగా.. ఏపీలో ఆ సంఖ్య 363కి చేరింది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే..
ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..