దీనస్థితిలో పాకిస్థాన్.. భారత్‌ను సాయం కోరుతున్న అక్తర్..

Coronavirus Outbreak: ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధానికి ఉసిగొలిపే దాయాది దేశం పాకిస్తాన్ దీనస్థితిలో ఇండియాను సాయం చేయమంటూ ప్రాధేయపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌ సాయమందించాలని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవని వివరించాడు. ఈ విషయంలో భారత్ తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం తమ దేశానికి 10 వేలకు పైగా […]

దీనస్థితిలో పాకిస్థాన్.. భారత్‌ను సాయం కోరుతున్న అక్తర్..
Follow us

|

Updated on: Apr 12, 2020 | 8:18 AM

Coronavirus Outbreak: ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధానికి ఉసిగొలిపే దాయాది దేశం పాకిస్తాన్ దీనస్థితిలో ఇండియాను సాయం చేయమంటూ ప్రాధేయపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌ సాయమందించాలని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవని వివరించాడు. ఈ విషయంలో భారత్ తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

ప్రస్తుతం తమ దేశానికి 10 వేలకు పైగా వెంటిలేటర్ల అవసరం ఉందని.. అవి లేకపోవడంతో మరణాల సంఖ్య ఎక్కువ అవుతోందని వివరించాడు. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను పక్కన పెట్టి మానవతా దృక్పధంతో భారత్ ముందుకు రావాలని కోరాడు. దీనితో పాటు విరాళాల కోసం ఇరు దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరపాలనే ప్రతిపాదనను కూడా అక్తర్ ముందుకు తీసుకొచ్చాడు. ఈ సిరీస్ ఆడితే వచ్చిన డబ్బుతో… కరోనాపై పోరాటం చేయవచ్చునని చెప్పుకొచ్చాడు.

అయితే షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్‌ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తో పాటు ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా  తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లను రిస్క్‌లో పెట్టాల్సిన అవసరం లేదని.. బీసీసీఐ దగ్గర కావల్సినంత డబ్బు ఉందని అంటూ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ అక్తర్‌కు చురకలు అంటించాడు.

అటు అక్తర్ వ్యాఖ్యలపై ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా మండిపడ్డాడు. కరోనా విరాళాల కోసం భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని అక్తర్ చెప్పిన సూచన చాలా సరదాగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు, ఐపీఎల్ నిర్వహించడానికే సాధ్యపడటం లేదు. ఇలాంటి సమయంలో మూడు వన్డేల సిరీస్‌ ఎలా సాధ్యపడుతుంది. కరోనా వ్యాప్తి ఉన్నప్పుడు ఒక దేశంలోకి మరో దేశం ఆటగాళ్లను ఎలా అనుమతిస్తారు.? అని అక్తర్‌ను సూటిగా ప్రశ్నించాడు.

ఇది చదవండి: కరోనా వేళ.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్…

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!