గుడ్ న్యూస్.. కరోనా నియంత్రణకు ఆరు ఔషధాలు రెడీ…

Coronavirus Outbreak: యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారు. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన ఓ కథనం నేచర్ జర్నీలో ఇటీవలే ప్రచురితమైంది. అమోదించబడిన ఔషదాల సామర్ధ్యాన్ని, క్లినికల్ ట్రయిల్స్‌లో […]

గుడ్ న్యూస్.. కరోనా నియంత్రణకు ఆరు ఔషధాలు రెడీ...
Follow us

|

Updated on: Apr 11, 2020 | 8:13 PM

Coronavirus Outbreak: యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారు. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన ఓ కథనం నేచర్ జర్నీలో ఇటీవలే ప్రచురితమైంది. అమోదించబడిన ఔషదాల సామర్ధ్యాన్ని, క్లినికల్ ట్రయిల్స్‌లో అభ్యర్ధులను, ఇతర సమ్మేళనాలను పరీక్షించారు. అయితే ప్రస్తుతం కరోనా లక్ష్యంగా చికిత్సా విధానాలు, థెరపీలు ఏవీ లేవని ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ల్యూక్ గుద్దాట్ తెలిపారు.

అందుకే ఔషదాల కోసం సీస సమ్మేళనాలను వేగంగా కనుగొనటానికి ప్రయోగశాలలో హై- త్రూపుట్ డ్రగ్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అంతేకాకుండా వైరస్‌ను వివిధ ఔషదాలు ఎలా బంధిస్తాయో తెలుసుకునేందుకు కంప్యూటర్లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించామని గుద్దాట్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం కోవిడ్ 19 వైరస్ ఎంజైమ్‌ అయిన ప్రోటీజ్‌ను నివారించడమే.. ఇది వైరల్ రెప్లికేషన్‌కు మధ్యవర్తిత్వం వహిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనితో అది ఆకర్షనీయమైన ఔషదానికి టార్గెట్ గా మారుతుంది. మేము కనుగొంటున్న ఔషదాలను నేరుగా ఎంజైమ్ లేదా సెల్ కల్చర్స్ మీద ప్రయోగిస్తాం. ప్రతీ సమ్మేళనం కూడా దానిపై ఎంతమేరకు పని చేస్తోందో అన్నది పరిగణనలో తీసుకుంటాం. ఒకవేళ తక్కువ మోతాదు వైరస్‌ను నిర్మూలించేందుకు సరిపోతుందని అనిపిస్తే.. దాని ద్వారా తదుపరి అధ్యయనాలు చేసేందుకు పరిశోధకులు కృషి చేస్తారని గుద్దాట్ అన్నారు.

ఇక ఈ పరిశోధనలో వేలాది ఔషధాలను పరిశీలించామని.. అందులో నుంచి ఆరు ఎంజైమ్ ను నిరోధించడానికి ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. “గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, స్ట్రోక్, అథెరోస్క్లెరోసిస్, క్యాన్సర్ వంటి వివిధ రుగ్మతల నివారణ మరియు చికిత్సతో సహా క్లినికల్ ట్రయిల్స్‌కు అవసరమయ్యే వాటిపై ప్రత్యేక దృష్టి సారించమని గుద్దాట్ వెల్లడించారు. పరిశోధకులు ఇప్పటికే కరోనా వైరస్ నివారణకు విరుగుడు కనిపెట్టేందుకు సమ్మేళనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. అంతేకాకుండా వాటిని యాంటీ వైరల్స్ గా టెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని అన్నారు. కాగా, నిరంతరం అధిక స్థాయిలో ప్రయత్నాలను కొనసాగిస్తే.. కరోనా మందు తొందర్లోనే తయారవుతుందని గుద్దాట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..