ఈ ఏడాదిలోనే ఐపీఎల్ జరుగుతుంది.. కానీ..?

Coronavirus Outbreak: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్‌ను బీసీసీఐ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వచ్చే సంవత్సరం నిర్వహిస్తారని.. మరికొందరు ఈ సంవత్సరమే మినీ లీగ్‌ కింద ఐపీఎల్ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం […]

ఈ ఏడాదిలోనే ఐపీఎల్ జరుగుతుంది.. కానీ..?
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:11 PM

Coronavirus Outbreak: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్‌ను బీసీసీఐ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వచ్చే సంవత్సరం నిర్వహిస్తారని.. మరికొందరు ఈ సంవత్సరమే మినీ లీగ్‌ కింద ఐపీఎల్ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ ఈ ఏడాది జరుగుతుందని తెలుస్తోంది. అక్టోబర్‌లో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్థానంలో ఈ లీగ్‌ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు విపరీతమైన  క్రేజ్ ఉంది. అంతేకాకుండా దీని బ్రాండ్ వాల్యూ సుమారు 51 వేల కోట్లుగా ఉంది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దైతే బీసీసీఐ భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే టీ20 వరల్డ్ కప్ స్థానంలో లీగ్ నిర్వహించాలని చూస్తున్నారట.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తాజాగా ఇదే విషయంపై స్పందించారు. ఇండియన్ ప్లేయర్స్‌తో మినీ ఐపీఎల్  నిర్వహించే ఛాన్స్ ఉందని ఆర్ఆర్ ఎగ్జిక్యూటివ్ బర్తకూర్ స్పష్టం చేశారు. బీసీసీఐ ఖచ్చితంగా ఈ లీగ్ గురించి ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..